క్యాబిన్లో ఇరుక్కుపోయిన ట్యాంకర్ డ్రైవర్
పెనుబల్లి, వెలుగు: ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం మండాలపాడు వద్ద నేషనల్హైవేపై రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఒకదాని డ్రైవర్క్యాబిన్లోనే ఇరుక్కుపోగా స్థానికులు తీవ్రంగా శ్రమించి బయటకు తీశారు. ఆదివారం ఉదయం మండాలపాడు శివారులోని బ్రిడ్జిపై ఎదురెదురుగా వచ్చిన లారీ, డాంబర్ట్యాంకర్ ఢీకొన్నాయి. ముందు భాగం నుజ్జునుజ్జు అవడంతో ట్యాంకర్డ్రైవర్ రాజేందర్తీవ్ర గాయాలతో క్యాబిన్లోనే చిక్కుకుపోయాడు.
స్థానికులు తీవ్రంగా శ్రమించి అతన్ని బయటికి తీసి హాస్పిటల్ కు తరలించారు. బాధితుడు మధ్యప్రదేశ్ వాసి అని తెలిపాడు. అవతలి వైపు లారీ డ్రైవర్ప్రమాదం జరిగిన వెంటనే పారిపోయాడు. బ్రిడ్జి ఇరుకుగా ఉండడంతో తరచూ ఇక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. వీఎం బంజరు ఎస్సై సూరజ్ ఘటనా స్థలానికి, రెండు లారీలను పక్కకు తీయించారు. ట్రాఫిక్ ను క్లియర్ చేశారు.